Ponnam Prabhakar: శాంతియుతంగా బోనాల ఉత్సవాలు : మంత్రి పొన్నం

ఆషాడ మాస బోనాల జాతర ఉత్సవాలు శాంతియుతంగా కొనసాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. హైదరాబాద్ అంబర్‌పేటలో బోనాల జాతర ఉత్సవాల (Bonal Festival)పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ పోలీసు (Police), రెవెన్యూ, దేవాదాయశాఖ, జీహెచ్‌ఎంసీ (GHMC), అగ్నిమాపక, విద్యుత్తు జలమండలి ఇతర విభాగాల అధికారులు ఒక ప్రణాళికలతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అంబర్‌పేట (Amberpet)లో నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్, సర్వీస్ రోడ్లపై ఏర్పడిన గుంతలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. దొంగతనాలు, శానిటైజేషన్, మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటకు మంత్రి ఆదేశించారు.