Konda Surekha: ఈ సమస్యను ఏపీ సీఎం చంద్రబాబు పరిష్కరించాలి : మంత్రి కొండా సురేఖ

భద్రాచలం ఈవో రమాదేవిపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. ఈవోలపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. దేవాలయ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ (PD Act) పెడతామని హెచ్చరించారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ను కొండా సురేఖ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నంలో భద్రాచలం (Bhadrachalam) రామాలయానికి చెందిన భూముల్లో ఆక్రమణలను అడ్డుకునేందుకు ఈవోతో పాటు సిబ్బంది వెళ్లారు. ఈవోపై గ్రామస్థులు దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయారు. ప్రస్తుతం ఈవో రమాదేవి (Ramadevi) భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.