తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థ లాయిడ్స్ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. లాయిడ్స్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తమ సాంకేతిక కేంద్రాన్ని త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. తొలి ఆరు నెలల్లోనే 600 మందిని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ నియమించుకోనుంది. అమెరికా, యూకే పర్యటనల్లో భాగంగా మే 13వ తేదీన లాయిడ్స్ బృందంతో సమావేశమైనట్లు కేటీఆర్ తెలిపారు. అతి తక్కువ వ్యవధిలోనే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.






