KTR:సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడకు ఎందుకు రాలేదు? : కేటీఆర్

మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చర్చ సిద్దమంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరిన కేటీఆర్ ఇవాళ ప్రెస్‌క్లబ్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అచారక పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారు. బేసిన్ల నాలెడ్జ్, నాలెడ్జ్ లేని సీఎం చర్చకు రావాలి. బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి సవాలు విసిరితే మేం వచ్చాయం. సవాలు విసిరిన సీఎం ఇక్కడకు ఎందుకు రాలేదు? సీఎం రాకపోతే మంత్రులై నా (Ministers ) వస్తారని భావించాం. బహిరంగచర్చకు రావాలని సీఎంకు మరోసారి చెబుతున్నాం. కొత్త తేదీ, ప్రదేశం రేవంత్‌రెడ్డి చెబితే మేం తప్పకుండా వస్తాం. అసెంబ్లీ (Assembly) లో చర్చించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. మైకులు కట్ చేయకుండా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధం అని అన్నారు.