దేశంలోనే తొలిసారిగా.. హైదరాబాద్ వేదికగా

ప్రపంచ కమ్మ మహాసభలకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మహానగరం వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20 నుంచి 21 వరకు తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమ కుమార్ వెల్లడించారు. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావటం, విశేష సేవలందించిన వారికి గుర్తింపు ఇవ్వటంతో పాటుగా ఇతర వర్గీయులకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేశామని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. వీరిద్దరు గతంలో ఒకే పార్టీకి చెందిన నేతలే అయినప్పటికీ ,ముఖ్యమంత్రుల హోదాల్లో తొలిసారి వేదికను పంచుకోబోతున్నారు. దేశ జనాభాలో 1.5 శాతంగా, ప్రపంచ వ్యాప్తంగా 2.1 కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని తెలిపారు.