Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి పై … స్పందించిన కేంద్రం

యూరియా కోటా (Urea quota) పెంచాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన విజ్ఞప్తి పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎరువు కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర అవసరాల మేరకు ఎరువులను సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డా (JP Nadda) ఆదేశాలు జారీ చేశారు. యూరియాను సాగేతరాలకు మళ్లించకుండా చూడాలన్నారు. అన్ని జిల్లాల (All districts )కు యూరియా పంపిణీ చేసేలా చూడాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో యూరియా వినియోగం పెరగడంపైనా నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 2024-25లో యాసంగిలో యూరియా అమ్మకాలు 21 శాతం పెరిగాయన్న ఆయన, సేంద్రియ సాగు ప్రోత్సాహానికి కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్రాలకు ప్రోత్సహకాలు ఉంటాయని చెప్పారు.