జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి

జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించడంతో రొనాల్డ్ రోస్ ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమ్రపాలికి రొనాల్డ్ రోస్ తో పాటు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం ఉన్నతాధికారుల బదిలీలు చేస్తోంది. అందులో భాగంగానే.. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఉన్న.. ఆమ్రపాలిని.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఇప్పటివరకూ ఆ పోస్టులో ఉన్న రొనాల్డ్ రోస్ని బదిలీ చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేస్తూ వచిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ లేడీ సింగంగా పిలుచుకునే ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని.. గతేడాది డిసెంబర్ లో మహానగరాభివృద్ది సంస్థ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా నియమించారు.