భవిష్యత్‌లో గులాబీ పార్టీకి మంచి రోజులు : కేసీఆర్

కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పలువురు పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అలాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని సూచించారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. భవిష్యత్‌లో గులాబీ పార్టీకి మంచి రోజలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తరచూ కలుస్తానని భరోసా ఇచ్చారు.