Addanki Dayakar:దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలి : అద్దంకి దయాకర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆడుతున్న డ్రామాలు కేటీఆర్ ఆపేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. అసెంబ్లీ (Assembly) వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి మాట్లాడిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముంటే కేసీఆర్‌ను తీసుకుని రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ (KTR) స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని, చిల్లర చేష్టలు మానుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ (KCR) లెటర్ ఇస్తే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట ఇచ్చినట్లే ఏక కాలంలో రైతు రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు.