సీఎం జగన్ ను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‍కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గురుమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చేతుల మీదుగా ఎంపీ గురుమూర్తి డిక్లరేషన్ ఫారంను అందుకున్నారు. గురుమూర్తి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ గురుమూర్తితో పాటు ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, సంజీవయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‍సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.