తిరుపతిలో వైకాపా విజయం

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2 లక్షల 65 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలిచారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి భారీ మెజార్టీతో పనబాకపై గురుమూర్తి గెలుపొందారు. ఈ విజయంతో వైకాపా అభ్యర్థి గురుమూర్తి అనుచరులు, వైకాపా కార్యకర్తలు, స్థానిక నేతలు సంబరాలు జరుపుకున్నారు. 2019లో ఎన్నికల్లో వైకాపా 2,28,00లకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికతో పోల్చుకుంటే ప్రస్తుతం వైకాపా సుమారు 40 వేల ఓట్లు ఎక్కువ రావడం విశేషం. తాజా సమాచారం మేరకు వైకాపాకు 56.5 శాతం ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 32.1 శాతం, బీజేపీకి 5.3 శాతం, కాంగ్రెస్ 0.9 శాతం, సీపీఎం 0.5 శాతం, ఇతరులకు 3.2 శాతం ఓట్లు పోలయ్యాయి. మరో 1.4 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు.