వైకాపాలో చేరనందుకే తనపై…

వైకాపాలో చేరనందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో ఉన్న భూములను చూపించి తనవని చెప్పి ఆక్రమణల ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 2014లో తనపై ఐటీ దాడులు జరిగాయన్నారు. తనకు భూములు ఎక్కడున్నాయో 2019 ఎన్నికల అఫిడవిట్‍లో పొందుపరిచానని చెప్పారు. విశాఖ జిల్లా గాజువాక మండలంలో అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ భూములు పల్లా కుటుంబానికి చెందినవని అధికార పార్టీ నేతలు ఆరోపించారు.