Minister Satyakumar: వదంతులు నమ్మొద్దు .. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు : మంత్రి సత్యకుమార్

డయేరియా కేసులు నమోదైన విజయవాడ లోని న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) తెలిపారు. మంత్రి నారాయణ (Minister Narayana) , ఎంపీ కేశినేని చిన్ని (Keshineni Chinni) తో కలిసి డయేరియా (Diarrhea) ప్రభావిత ప్రాంతంలో ఆయన పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున చేపట్టిన చర్యలను మంత్రులకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మంచినీటి పైపులైన్, అండర్ గ్రౌండ్ నీటి నమూనాలను పరీక్షకు పంపాం. నెగెటివ్ రిపోర్టు వచ్చినా మంచినీటి సరఫరా నిలిపివేశాం. బయట నుంచి మినరల్ వాటర్ క్యాన్లతో సరఫరా చేస్తున్నాం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. స్థానికులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నాం. ఇంటింటికీ వెళ్లి మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇచ్చాం. డయేరియాతో ఎవరు చనిపోలేదు. వదంతులు నమ్మొద్దు. మొదటిసారి ల్యాబ్‌రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చింది. రెండో విడత నమూనాలను కూడా ల్యాబ్‌కు పంపాం అని తెలిపారు.