Nara Lokesh: ఏపీకి మరో భారీ పెట్టుబడి .. రూ.లక్షా పది వేల కోట్లతో
ఆంధ్రప్రదేశ్లో బ్రూక్ఫీల్డ్ (Brookfield) అసెట్ మేనేజ్మెంట్ రూ.లక్షా పది వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఇది మరో భారీ పెట్టుబడి అని పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీ, పంఫ్డ్ స్టోరేజ్ రంగాల్లో బ్రూక్ఫీల్డ్ పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. రియల్ఎస్టేట్ (Real Estate), బీసీసీ (BCC)లు, ఇన్ఫ్రా, పోర్టుల్లోనూ పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు.






