kodi Pandalu: ఏపీలో జోరుగా కోడిపందేలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు (kodi Pandalu) జోరుగా సాగుతున్నాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో కోలాహలం నెలకొంది. తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో కోడిపందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishna Raju), ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి (Teegala Krishnareddy) తదిరులు తిలకించారు.






