ప్రవాసాంధ్రుల సేవలు వెలకట్టలేనివి : జయరాం కోమటి
విదేశాల నుంచి వచ్చి ఎన్డీయే కూటమి విజయానికి కృషి చేసిన ప్రవాసాంధ్రులకు టీడీపీ ఎన్నారై విభాగం సమన్వయకర్త జయరాం కోమటి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని నమ్మి వారు ఎన్డీయేను గెలిపించారన్నారు. వారి సేవలు, సహకారం వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. ఈ అఖండ విజయంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు. విదేశాల నుంచి వచ్చి రెండు, మూడు నెలల పాటు సొంతూళ్లలో వారు ఎన్డీయే విజయం కోసం పని చేశారు. వారు ఆశించిన విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలుపుతారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని పూర్తి చేస్తారు. ఈ అభివృద్ధిలో మీరూ భాగస్వాములుకండి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. కంపెనీలు స్థాపించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవశాలు కల్పించండి అని కోరారు.







