Orvakallu: ఓర్వకల్లు లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ పరిశ్రమ
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో జాయింట్ వెంచర్ ద్వారా ఎడ్వాన్డ్స్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఈ-జౌల్ ఇండియా ముందుకు వచ్చింది. రూ.19,500 కోట్ల (2.2 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమక్షంలో ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఈడీబీ)తో ఒప్పందం చేసుకుంది. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్‌లోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రతినిధి, రాయబారి ముమిన్చెన్ నేతృత్వంలోని తైవాన్ (Taiwan) ప్రతినిధుల బృందం, ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించింది. కుప్పంలో రూ.400 కోట్లతో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు అలీజియన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. పాదరక్షల తయారీ సంస్థ పౌ చెన్ గ్రూప్ ఓ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఓర్వకల్లు (Orvakallu)లో ఇమేజ్ సెన్సర్ యూనిట్ల ఉత్పత్తికి క్రియేటివ్ సెన్సర్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సెమీకండక్టర్ మిషన్ కింద ప్రోత్సాహకాలు అందించాలని కోరింది.






