ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి విజయం పై నాట్స్ హర్షం
చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల విజయమని అభివర్ణించింది.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేయాలనే ఆకాంక్షను నాట్స్ వ్యక్తం చేసింది. అమెరికాలో ఉండే తెలుగు ప్రజల తరఫున నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.







