తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు గుడ్ న్యూస్ రానుంది. కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ పార్కులు ఏర్పాటు కానున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ భారీ ప్యాకేజీని కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాటు బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఇతర ప్రాంతాల్లో కొత్తగా ఈ పారిశ్రామిక పార్కులను కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. కేబినెట్ తీసుకొన్న ఈ నిర్ణయంతో రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక పురోగతి గణనీయంగా పెంచుతుందని కేంద్రం యోచిస్తోంది. ఈ వారంలోనే కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని సమాచారం.