Chandrababu: సీఐఐ సదస్సుకు ముందే రూ.2.66 లక్షల కోట్ల ఎంవోయూలు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.2.66 లక్షల కోట్ల ఎంఓయూలు సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు కంటే ముందే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడిరచారు. 9 జిల్లాలతో పాటు చేస్తున్న విశాఖ (Visakhapatnam) ఎకనామిక్ రీజియన్ భవిష్యత్ ఆర్థిక శక్తిగా, ఏపీని నిర్దేశించే ఓ మోడల్ కానుందన్నారు. దేశంలోని నాలుగు నగరాలకు విజన్ తయారు చేయాలని కేంద్రం నిర్దేశించిన జాబితాలో ముంబయి. వారణాసి, సూరత్ లలో పాటు విశాఖ కూడా ఉందని తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి, నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం (Subramaniam) విడుదల చేశారు.
అక్షర క్రమంలో, అభివృద్ధి పోటీలోనూ ఏపీనే ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలుగుతున్నామని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విశాఖపట్నం ఇండస్ట్రియల్ రీజియన్ మాస్టర్ ప్లాన్`2040కు రూపకల్పన చేశామని, తూర్పుతీరంలో వీఈఆర్ దేశ ఆర్థిక ప్రగతికి గేట్వగా పనిచేస్తుందని తేల్చిచెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి చైర్మన్ హోదాలో తానే స్వయంగా నెలకోసారి అభివృద్ధిని సమీక్షిస్తానని తెలిపారు.






