CII Summit: విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఈ సదస్సును ప్రారంభించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu), కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ చంద్ర జిత్బెనర్జీతో పాటు దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ అన్నారు. కేంద్రం సాయంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని, రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం వేగంగా ముందుకెళ్తోందని జీఎంఆర్ కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో దోహదం చేస్తుందని వివరించారు.






