ఏపీలో లాక్‍డౌన్ పెట్టండి : చంద్రబాబు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్టా లాక్‍డౌన్‍కు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాపించిన అతి ప్రమాదకర ఎన్ 440కే వ్యాపించిందన్నారు. ఇతర వైరస్‍ల కన్నా 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతోందన్నారు. వ్యాక్సినేషన్ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయాన్నారు. వైకాపా ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్యాలయాలకు రంగుల కోసం రూ.3 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు నియామకాలు చేపట్టాలన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 14 రోజుల పాటు ఒరిస్సా లాక్‍డ్‍ను ప్రకటించిందని అన్నారు.