ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇంటర్ పరీక్షలు

ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరీక్ష నిర్వహణ విషయంలో హైకోర్టు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.