High Court: డిప్యూటీ సీఎం ఫొటో పై నిషేధం లేదు : హైకోర్టు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) లో విచారణ జరిగింది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫొటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వాదనల సందర్భంగా డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ (Petition) వేశారని పేర్కొంటూ పిల్‌ను డిస్మస్ (Dismus) చేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని సూచించింది.