ఏపీలో పాక్షిక లాక్‌డౌన్…

ఏపీలో అంతకంతకూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూను అమలు చేయనుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలను తెరిచి ఉంచడానికి అనుమతినిచ్చింది. ఈ ఆంక్షలు రెండు వారాల పాటు అమలులో ఉండనున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆ సమయంలో 144 సెక్షన్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఏపీలో రాత్రి కర్ఫ్యూ అందుబాటులో ఉంది.