ASBL NSL Infratech

అనంతపురం జిల్లా కూడేరులో వైయస్ జగన్ ప్రసంగం

అనంతపురం జిల్లా కూడేరులో వైయస్ జగన్ ప్రసంగం

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కూడేరు చేరుకున్న జగన్ 
బాబు పాలన ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? 
అబద్ధాలు, మోసం చేసే వాడు నాయకుడిగా కావాలా?
బాబు రాకపోతే నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. ఇచ్చారా?
ఓటుకు కోట్లు కేసు కోసం ప్రత్యేక హాదాను తాకట్టు 
నాలుగేళ్ల బాబు పాలనలో అంతా అవినీతిమయం
ఎన్నికలప్పుడు బాబు చెప్పినదానికీ చేస్తున్నదానికీ పొంతనేది?
ప్రతి ఇంటికీ బాబు రూ.90వేలు బాకీ పడ్డారు. 
రాజధాని నుంచి గుడి భూముల వరకు దోపిడీయే..
జన్మభూమి కమిటీలు మాఫియాలా తయారయ్యాయ్..
బాబు మాటలు నమ్మరని సినిమాయాక్టర్ ను పక్కన  పెట్టుకుంటారు.
బాబుకు తనది పూచి అని ఆ సినిమా యాక్టర్ అంటారు. 
మోసాలు, అబద్ధాలు ఆడేవారిని తరిమేయాలి. 

- వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు గ్రామంలో శ్రీ వైయస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ జగన్ మాట్లాడుతూ.. 

అధికారం కోసం చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని తెలిపారు. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వకంగా కృత‌జ్ఞత‌లు తెలిపారు. నాలుగు సంవత్సరాల తరువాత మిమ్మల్ని అడుగుతున్నా.. . 4 సంవత్సరాల పాలనలో.. అవినీతే జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కావటం కోసం.. బాబు వాగ్ధానాలు ఒక్కసారి గుర్తు చేసుకోండన్నారు. ప్రతి పేదవాడికీ మూడు సెంట్లలో ఇళ్లు కట్టిస్తానని బాబు అన్న సంగతి ఈ సందర్భంగా శ్రీ జగన్ గుర్తు చేశారు. ఇప్పటికి నాలుగేళ్లు అవుతోంది. మీకు ఒక్క ఇళ్లైనా కట్టించారా అని శ్రీ జగన్ ప్రశ్నిస్తే.. లేదని అందరూ చేతులు ఊపారు. బాబు ముఖ్యమంత్రి కాకమునుపు రూ.50, రూ.100లోపు కరెంటు బిల్లు వచ్చేదన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత బాబు వచ్చాక మీకు ఎంత కరెంటు బిల్లు వస్తోందని ప్రశ్నిస్తే.. రూ.500 రూ.600, రూ.1000 కరెంటు బిల్లు వస్తోందని శ్రీ జగన్ తెలిపారు. కరెంటు వాళ్లు ఇళ్లలోకి వచ్చి ఇది ఉందని, అది ఉందని కరెంటోళ్లు పెనాల్టీ రూ.10-20 వేలు వేస్తున్నారన్నారు. ఇదే చంద్రబాబు పాలనకు ముందు 4 ఏళ్ల క్రితం రేషన్ షాపుల్లో .. కిరోసిన్, చక్కెర, కందిపప్ప, పామాయిల్, గోధుమ పిండి, కారం, పసుపు, ఉప్పు, చింతపండు.. ఇచ్చేవారన్నారు. రేషన్ షాపులో బియ్యం తప్ప ఇతర నిత్యావసర సరుకులు ఏవీ ఇవ్వటం లేదన్నారు. దీనికి ప్రజలంతా అవునని చేతులు ఊపారు. ఇంట్లో ఐదుగురో-నలుగురో ఉంటే వేలిముద్రలు పడటం లేదని బియ్యం ఇవ్వకుండా ఎగరగొడుతున్నారన్నారు.

ఎన్నికల్లో గెలవాలని.. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. సరిగ్గా వినపటం లేదని శ్రీ జగన్ రెట్టించగా.. బాబు రావాలని మరింత గట్టిగా ప్రజానీకం సమాధానం ఇచ్చారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండు వేలు ఇస్తానని అన్నారు. రాష్ట్రంలో కోటి డెబ్భైలక్షల ఇళ్లు ఉన్నాయని శ్రీ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయి .. దాదాపు 45 నెలలు అయింది. అంటే ప్రతి ఇంటికీ 90 వేలు చంద్రబాబు బాకీ పడ్డారన్నారు. ఇదే పెద్ద మనిషి అధికారంలో రావటం కోసం.. బ్యాంకుల్లో బంగారం మీ ఇంటికి రావాలంటే.. బాబు రావాలన్నారు. మరి, నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చిందా అని శ్రీ జగన్ ప్రజానీకాన్ని ప్రశ్నిస్తే.. లేదని చేతులు ఊపారు. బంగారం రాలేద సరికదా.. బంగారం వేలం వేస్తున్నట్లు బ్యాంకుల నోటీసులు ఇంటికి వస్తున్నాయని శ్రీ జగన్ తెలిపారు.

రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేసిన బాబు

బాబు రుణమాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోవటం లేదన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను కూడా ఇలాగే బాబు మోసం చేశారని శ్రీ జగన్ తెలిపారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత అక్కచెల్లెమ్మలను అడుగుతున్నా..  పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. లేదని ప్రజలు చేతులు ఊపారు. ప్రత్యేక హోదా పేరుతో.. రాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేశారన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డగోలుగా దొరికిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా పట్టుబడితే ఆ ఉద్యోగి ఉద్యోగంలో ఉంటారా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచేసి నల్లధనాన్ని ఇస్తూ.. అడ్డగోలుగా చంద్రబాబు దొరికిపోయాడు. ఆ కేసు నుంచి బయటపడటానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని శ్రీ జగన్ తెలిపారు. 

ఇసుక నుంచి మట్టి వరకు.. మట్టి నుంచి మద్యం వరకు.. మద్యం నుంచి.. బొగ్గు వరకు.. బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల వరకు.. కాంట్రాక్టర్ల నుంచి రాజధాని భూముల వరకు.. రాజధాని భూముల నుంచి గుడి భూముల వరకు అవినీతి కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో న్యాయం.. ధర్మం లేదు.. ఎక్కడ చూసినా అవినీతే అన్నారు. చంద్రబాబు మొదలు గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల వరకు మాఫియాను తీసుకువెళ్లారన్నారు. పైన చంద్రబాబు అవినీతి చేస్తే.. కింద జన్మభూమి కమిటీలు చేస్తున్నాయని శ్రీ జగన్ మండిపడ్డారు. నాలుగు సంవత్సరాల తరువాత మిమ్మల్ని అడుగుతున్నా.. . 4 సంవత్సరాల పాలనలో.. అవినీతే జరుగుతోందన్నారు. 

ఈసారి ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ కేజీ బంగారం కొని ఇస్తామంటారు. ప్రతి ఇంటికీ ఓ మారుతీ కారు కొనిస్తానని ఈ పెద్దమనిషి చెబుతారన్నారు. మారుతి కారు, కేజీ బంగారంతో పనిజరగదు అనుకుంటే ఏదైనా చెప్పేస్తారని శ్రీ జగన్ అన్నారు. ఈసారి తను చెబితే నమ్మరన వేరే వ్యక్తిని తన పక్కన చంద్రబాబు పెట్టుకుంటారని అన్నారు. తన మాటలు ప్రజలు నమ్మరని సినిమా యాక్టర్ నో ఇంకొకరినో పెట్టుకుంటారని శ్రీ జగన్ అన్నారు. చంద్రబాబుకు నాది పూచి అని ఆ సినిమా యాక్టర్ చెబుతారు. ఈ పాలన, వ్యవస్థలు మార్పు రావాలంటే.. విశ్వసనీయత రావాలని శ్రీ జగన్ తెలిపారు. ఇది ఒక్క జగన్ వల్లే కాదని, జగన్ తో తోడుగా మీరుండాలని ప్రజల్ని కోరారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత రావాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందన్నారు. ఈ పాదయాత్ర రైతులకు, విద్యార్థులకు, మహిళలకు భరోసా కల్పించేందుకు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని రాజకీయనాయకుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందన్నారు. 

ఉరవకొండ నియోజకవర్గమే తీసుకుంటే.. వచ్చేముందు రైతుల్ని కలిశానని శ్రీ జగన్ తెలిపారు. రైతులు అప్పులు పాలుకాకుండా ఆరోగ్యాన్ని, విద్యను అందించారని చెప్పారన్నారు. నిత్యం కరువుతో అల్లాడే అనంతపురం జిల్లాకు నిత్యం సాగు, తాగు నీరు ఇచ్చారన్నారు. మీ హయాంలో రైతులకు దళారీ వ్యవస్థ పోయి గిట్టుబాటు ధర అందిచమని రైతన్నలు అడిగారని శ్రీ జగన్ తెలిపారు. పత్తి, వేరుశెనగ పంట పండిస్తున్న రైతులను అడుగుతున్నా.. మీరు పండిస్తున్న పత్తి, వేరుశెనగ పంటలకు గిట్టుబాటు ధర ఉందా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. కారణం ఏమిటి అంటే.. రైతన్నలు చంద్రబాబు దళారీలకు అమ్మేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయనే దళారీ కాబట్టి ఇలా చేశారన్నారు. చంద్రబాబుకు హెరిటేజ్ షాపు ఉంది.. అది రైతన్నల నుంచి కొనుగోలు చేసి ప్యాకేజీ చేసి ఆకాశానికి అంటే ధరలకు అమ్ముతారు. చంద్రబాబు దళారీ కాబట్టే రైతన్నలను అమ్మేశారన్నారు. ఉరవకొండలో హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా .. 3.5 లక్షల ఎకరాలు సాగు అవుతాయన్నారు.

ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయని విధంగా మహానేత హయాంలో పనులు చేయించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికే దాదాపుగా రూ.6వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారన్నారు. మల్లాది నుంచి జీడిపల్లి వరకు పనులు పూర్తయ్యాయంటే అది ఆ దివంగత నేత చలువే అన్నారు. మిగిలిన 10, 15% పనులు చంద్రబాబు పూర్తి చేయలేదని, పిల్లకాల్వలు తవ్వలేదన్నారు. రైతన్నలను ఆదుకునే పరిస్థితి లేదన్నారు. పక్కన పీఏపీఆర్ డ్యాం ఉన్నా.. నీళ్లు ఉన్నా.. ఇవ్వటం లేదన్నారు. ఉపఎన్నికలు వస్తేనే వీళ్లకు ప్రజలు గుర్తుకు వస్తారు. ఉరవకొండలో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించటానికి 88 ఎకరాలు సేకరించారని శ్రీ జగన్ గుర్తు చేశారు. అయితే, ఇక్కడ విశ్వేశ్వరన్న ఉన్నారు కాబట్టి చంద్రబాబుకు మనం గుర్తుకు రావటం లేదన్నారు. 

బాబుకు బీసీల మీద ప్రేమ ఉందా?

చేనేతల మీద చంద్రబాబుకు ప్రేమ ఉందా అని శ్రీజగన్ ప్రశ్నించారు. బీసీల మీద చంద్రబాబుకు ప్రేమ ఉందా అని అడిగారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఫోజులు ఇస్తారన్నారు. చేనేతలకు ఎంతో చేస్తామన్నట్లు ఫొటోలు ఫోజుల ఇస్తారన్నారు. గొర్రెపిల్ల కనబడితే ఓ ఫోజు పెడతారంటారు. గౌడ సోదరులు కనబడితే అదో ఫోజు పెడతారు. బీసీల మీద, చేనేతల మీద ప్రేమ అంతా ఎన్నికలప్పుడే గుర్తుకు వస్తారని శ్రీ జగన్ తెలిపారు. ఎన్నికలప్పుడు నాలుగు ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇచ్చి ఇదే ప్రేమని బాబు అంటారని శ్రీ జగన్ తెలిపారు. 

నవరత్నాలు.. ప్రకటించాం.. 

ఇక్కడ చేనేతలు, బీసీలు ఎక్కువ కాబట్టి నవరత్నాల నుంచి నాలుగు మాటలు చెబుతాను. బీసీల మీద ప్రేమ ఏమిటో.. నేను మీకు చెబుతాను. చంద్రబాబు వస్తే గట్టిగా అడగండని శ్రీ జగన్ పిలుపు ఇచ్చారు. నా దగ్గరకు చిన్నచిన్న పిల్లల్ని తీసుకువచ్చారు. ఆ పిల్లల్ని బడులకు వెళ్లాలని.. సూచించానని వీళ్లు ఇంజనీర్లు, డాక్టర్లు అయినప్పుడే మన జీవితాలు బాగుపడతాయన్నారు. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు చదివే పరిస్థితి ఉందా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఇంజనీరింగ్ ఫీజు లక్ష దాటితే బాబు మాత్రం ముష్టి వేసినట్లు రూ.35వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఆ పిల్లవాడు ఇంజనీరింగ్ అయ్యేనాటికి ఆస్తులు అమ్ముకుంటే తప్ప ఆ పిల్లలు ఇంజనీరింగ్ పట్టా తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులను ఏం చదువుతారో చదవండి ఆయన ప్రోత్సహిస్తూ.. ఒక అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకుగా నేను రెండు అడుగులు వేస్తున్నా అని తెలిపారు. మీ పిల్లలు ఏం చదివినా నేను చదివిస్తా అని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పిల్లలకు హాస్టల్ ఖర్చులు, మెస్ ఖర్చులు కూడా నేనే భరిస్తానని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి పిల్లవాడికి మెస్ ఛార్జీలకు, హాస్టల్ ఛార్జీలకు రూ.20వేలు ఇస్తామని శ్రీ జగన్ ప్రకటించారు. 

చిన్నారులు స్కూల్ కు వెళ్లినప్పుడు రేపు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారని మీ పిల్లలను బడులకు పంపించడని శ్రీ జగన్ కోరారు. ప్రతి తల్లికీ సంవత్సరానికి 15వేలు ఇస్తామని శ్రీ జగన్ ప్రకటించారు. ఆ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. అప్పుడే భవిష్యత్ బావుంటుందన్నారు. మంచి అన్నయ్య ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి తల్లికీ రూ.15వేలు ఇస్తామన్నారు. నవరత్నాల్లోంచి ఇంకో రెండు కార్యక్రమాలను శ్రీ జగన్ తెలిపారు. 

అవ్వాతాతల కోసం.. 

ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. వెయ్యి రూపాయల పింఛన్ ను రెండు వేలకు పెంచుతామని శ్రీ జగన్ ప్రకటించారు. పనులకు వెళ్తే తప్ప కడుపు నిండని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీర సోదరులకు చెబుతున్నా.. వీరంతా కష్టపడితే తప్ప కడుపు నిండని పరిస్థితి ఉంది. వారం పాటు పనులకు వెళ్లకపోతే పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. పింఛను 2వేలు చేయటంతో పాటు 45 ఏళ్లకే తగ్గిస్తామన్నారు. దీనివల్ల ఎక్కువ మందికి పింఛను వస్తుందన్నారు. ప్రతి పేదవాడు సంతోషంతో బ్రతికే పరిస్థితి వస్తుందన్నారు. ఇళ్లులు కట్టించే విషయంలో చంద్రబాబు ఏం చేశారో మీరంతా చూశారు. ఇళ్లులేని ప్రతి పేదవాడికీ ఇళ్లు కట్టిస్తా అని ప్రకటించారు. ఆ ఇళ్లు కట్టించి ఇవ్వటమే కాకుండా అక్కచెల్లెమ్మల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. 

రేషన్ కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మీరు పడుతున్న బాధలు తెల్సు. జన్మభూమి కమిటీలు, కలెక్టర్లు అంటారు. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వస్తే.. ఏది కావాలన్న పేదవాడు ఎవ్వరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్ తెరుస్తాం. మీ గ్రామం నుంచి 10 మందికి ఉద్యోగాలు ఇస్తా. ఏం కావాలన్నా.. 72 గంటల్లో వచ్చేట్లు చేస్తామని శ్రీ జగన్ ప్రకటించారు. ఇవి ఇచ్చేటప్పుడు .. జన్మభూమి కమిటీలు, కులాలు, రాజకీయాలు, వర్గం చూడమని.. ప్రతి పేదవాడికీ తోడుగా ఉంటామని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. మీ అందరి దీవెనలు కావాలి. మీ అందరి ఆశీస్సులు కావాలి. నవరత్నాల్లో సలహాలు ఇవ్వాలన్నా, మార్పులు చేర్పులు ఇవ్వాలన్నా ఇవ్వండని శ్రీ జగన్ కోరారు. నేను ఎక్కడకి వెళ్తున్నానో మీ అందరికీ తెల్సు. ఈ 3000 కి.మీ ప్రయాణంలో దారిపొడవునా మీరు అర్జీ తీసుకొచ్చి కలవొచ్చన్నారు. మీ బిడ్డను ఆశీర్వదించండని పేరు పేరునా ప్రతి అక్కకు, అవ్వకు, తాతకు, సోదరుడికి, స్నేహితునికి ధన్యవాదాలు తెలిపారు.

Click here for Photogallery

 

Tags :