ASBL NSL Infratech

పోలింగ్ సందర్భంగా ట్రోలింగ్ అవుతున్న నేతలు..

పోలింగ్ సందర్భంగా ట్రోలింగ్ అవుతున్న నేతలు..

నిన్న ఆంధ్రాలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చాలామంది నేతలు ట్రోలింగ్ కి గురి అవుతున్నారు. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తెనాలి లో జరిగిన చెంపదెబ్బల పర్వం ఏ రేంజ్ లో హైలెట్ అయిందో అందరికీ తెలుసు. మరోపక్క ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఓటు వేయడానికి సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది. పోలింగ్ బూత్ లో అలా అతను ఫోన్ మాట్లాడుతుంటే.. అధికారులు ఏమి మాట్లాడకపోవడంపై జనం ప్రశ్నిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా అని అడుగుతున్నారు. సామాన్య ఓటరు సెల్ ఫోన్ తీసుకువస్తే ఒప్పుకోని అధికారులు దువ్వాడ ఫోన్ మాట్లాడుతూ ఓటు వేయడానికి వెళుతుంటే ఎలా సైలెంట్ గా ఉన్నారు అంటూ ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి ఈసారి ట్రోలింగ్ కి ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. మరోపక్క వైసీపీ ఈసారి గట్టిగా పవన్ పై కాన్సెంట్రేట్ చేసింది. ఎప్పుడూ వీళ్ళ ట్రోలింగ్ కు లోకేష్ చిక్కుతాడు.. కానీ ఈసారి వెరైటీగా పవన్ బుక్ అయిపోయాడు. పోలింగ్ బూత్ వద్ద తన ఓటు వేసిన పవన్.. ప్రింట్ రాదా అని అడిగిన మాట పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయింది. ఈవీఎం మిషన్ మీట నొక్కిన తర్వాత.. ప్రింట్ రాదా అన్న పవన్ డైలాగు ని వైరల్ చేయడమే కాక.. అతని అవగాహన స్థాయి అది అంటూ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఉన్న వీడియోస్ లో ఇది ముఖ్యమైనది. నిన్నటి ఓటింగ్ పర్వం తర్వాత ఈరోజు ట్రోలింగ్ పర్వం మొదలైంది. వాళ్లని వీళ్ళు విమర్శించడం.. వాళ్లకు వీళ్ళు కౌంటర్ ఇవ్వడం.. దాదాపు ఈ రోజంతా సోషల్ మీడియా ఇదే పందాలో సాగేలా కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :