ASBL NSL Infratech

ఓటరు మహాశయా...  ఏమి తీర్పు ఇస్తున్నావు?? 

ఓటరు మహాశయా...  ఏమి తీర్పు ఇస్తున్నావు?? 

గత రెండు నెలలుగా ..ఇంకా చెప్పాలంటే గత రెండు - మూడు వారాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన పార్క్ ఆయిన  వైసీపీ ఒక వైపు , ప్రతిపక్ష పార్టీ టీడీపీ , ఆ తర్వాత టీడీపీ - జనసేన -బీజేపీ ల కూటమి రెండు వైపు హోరాహోరీ ఎన్నికల సంగ్రామంలో తమ తమ ప్రచారం చేశాయి.  ఇంకొక 3-4 గంటలలో  ఓటర్లు ఓటు వేసి తమ తీర్పు చెప్పబోతున్నారు కనుక ఏం జరిగింది అని చిన్న విశ్లేషణ ఇస్తున్నాను.  రెండు వైపులా వారి వారి బలాబలాలు, ఎత్తులు - పై ఎత్తులు , వాడిన అస్త్రాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

ముఖ్యమంత్రి జగన్ - వైసీపీ పార్టీ: 

'వై నాట్ 175 ?' అనే ఆశయం తో, ' సిద్ధం!' అనే నినాదం తో   జగన్ అంటే వైయస్సార్ పార్టీ, పార్టీ అంటే ఆ జగన్ అన్న చందాన అందరికంటే ముందుగా శంఖారావం ఊది  ఎన్నికల సమరం లో దిగింది  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.  మొదటగా జగన్ నిర్వహించిన సిద్ధం  సభలు , నిర్వహించిన విధానం, వచ్చిన జనం,   ' నేను సిద్ధం ! మీరు సిద్ధమేనా? ' అని జగన్ మాట్లాడిన పద్ధతి  అందరినీ ఆకర్షించింది.  ఆ సమయం లో వైసీపీ గెలుపు , జగనే   ముఖ్యమంత్రి అన్న అభిప్రాయం హార్డ్ కోర్ టీడీపీ వారికి కూడా కలిగింది అనడం లో ఆశ్చర్యం లేదు. అలాగే సిద్ధం సమావేశాలు అంటూ జగన్ చేపట్టిన బస్సు యాత్ర కూడా  విజయవంతం అయింది అని చెప్పాలి. యుద్ధం ముందు నాయకుడు గా జగన్ ఒక్కడై నిలిచారు  అన్న మాట ఎంత నిజమో  ...ఆ సభలు అన్ని అంత  పద్ధతిగా  ఏర్పాటు చేయడం లో, జన సమీకరణ కంటే ముఖ్యం గా వచ్చిన అశేష జనం కి  ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడటం, వారికి మంచి నీరు- ఆహారం ఏర్పాటు చేయడం, శాంతి- భద్రతల పరిరక్షణ చూసుకోవడం వెనుక పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ అధికారులు ఉన్నారన్న సంగతి కూడా అంతే నిజం అని అందరూ అనుకున్నారు. 

59 నెలలుగా దాదాపు 275 వేల కోట్ల రూపాయలు 65 లక్షల కుటుంబాలకు అనేక పధకాల ద్వారా చేరాయని జగన్ పడే పడే చెప్పడం, ' మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు వోట్ వేయండి.. మీరే ఇతరులకు చెప్పండి !' అని  అన్ని చోట్లా జగనే  చెప్పడం అందరిని ఆకట్టు కొంది. ఆ విధంగా, ధైర్యం గా ఒక  నాయకుడే చెప్పడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అని దేశంలో అనేక మీడియా కధనాలు  వచ్చాయి.  

ప్రతి నియోజక వర్గం లో వున్న జనాభా వివరాలు పూర్తిగా అధ్యయనం చేసి ( Social Engineering ) ఎన్నికల ప్రణాళిక తయారు చేసుకోవడం, అభ్యర్ధులని నిర్ణయించటం కూడా రిస్క్ తో కూడిన సాహసమైన చర్య అని  కొందరు విశ్లేషించారు  కూడా. 

టీడీపీ -జనసేన - బీజేపీ కూటమి :

అధికారం లో గాని, ప్రతి పక్షం లో గాని 40 ఏళ్ళు గా రాష్ట్రంలో వున్న టీడీపీ నాయకులను, క్యాడర్ ను ఒక పక్క సముదాయిస్తూ , సమాయత్తం చేస్తూ , ఇంకో పక్క పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడితో మాట్లాడుతూ  జనసేన పార్టీ ని కలుపుకొని పోతూ, ఏ సంగతి చివరి వరకు తేల్చని బీజేపీ అగ్ర నాయకత్వం తో  చర్చలు సాగిస్తూ చివరికి కూటమి కి ఒక రూపు రేకలు తేవడం లో చంద్ర బాబు నాయుడు తన అనుభవాన్ని చూపించారు అని  చెప్పాలి.  కూటమి ఏర్పాటు చేయడం ఆలస్యం అయినా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు దగ్గర నుంచి ఏ  నియోజకవర్గం ఎవరికీ  లాంటి అనేక సమస్యలు ఏర్పడిన , చంద్రబాబు అన్నీ సర్దుబాటు చేసి ఎన్నికల సమరం సమర్థ వంతం గా  నిర్వహించారు అని చెప్పాలి. 

ప్రభుత్వ వ్యతిరేక  ఓటు చీలకూడదు అన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన కూటమి   'గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని, రాష్ట్రానికి రాజధాని లేదు'  అని తన ముఖ్యమైన మెసేజ్ గా చెప్పడం చాలా మందిని ఆలోచనలో పడేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజా వ్యతిరేక చట్టం గా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లారు.

ఎన్నికల ప్రచారం :

చాలా భీకరంగా .. హోరా హోరీగా జరుగుతున్న  ఎన్నికల యుద్ధం ఇది. టీడీపీ - వైసీపీ ల మధ్య 2014 లో, 2019 లో ఇంత పోరాటం జరగ లేదు.   ఏ వారానికి ఆ వారం , ఏ రోజు కి ఆ రోజు సరి కొత్త వ్యూహం తో రెండు వర్గాలు పోటీ పడ్డాయి అని చెప్పాలి.  

*  59 నెలలుగా ఇచ్చిన పథకాలే తమ ను మళ్లీ ప్రభుత్వం వైపు కు తీసుకెళ్తాయి  అని విశ్వాసం తో ముందుకెళ్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ  రాష్ట్రాన్ని అప్పుల్లో పడేసింది జగన్ ప్రభుత్వం అన్న టీడీపీ / కూటమి తమ మేనిఫెస్టో లో అనేక జనాకర్షక పథకాలు పెట్టి విస్తృతం గా ప్రచారం చేసింది. అయితే చంద్రబాబు ఎప్పుడూ మేనిఫెస్టో ని సీరియస్ గా తీసుకోలేదు అని జగన్ అన్ని చోట్లా చెప్పడం మొదలెట్టారు. 

*  'గ్రామ సచివాలయాలు - వాలంటీర్లు ప్రవేశ పెట్టి దాదాపు 240000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము - వారే మా సైనికులు' అని చెప్పుకుంది  వైసీపీ. 'మేము కూడా వాలంటీర్ల వ్యవస్థ ను కొనసాగిస్తాం .. వారి జీతం Rs 5000 నుంచి Rs 10000 చేస్తాం " అని కూటమి ప్రకటించింది. 

*  యుద్ధం లో భాగం గా ఎన్నికల తేదీ కి రెండు వారాల ముందు బయటకు వచ్చిన అస్త్రం - ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం ద్వారా మీ మీ ఆస్తులు కబ్జా అవుతాయి అన్ని పాయింట్ జనాల్లోకి బాగానే వెళ్ళింది. అధికార పార్టీ కి తమ చర్య ని సరైన పద్దతిలో  వివరించు కొనే అవకాశం రాలేదు. 

*  బీజేపీ తో పొత్తు వలన ఆంధ్ర జనాలలో వున్న అయిష్టత - ముస్లిం ల వ్యతిరేకత ల వలన కూటమికి నష్టం కలిగే అవకాశం ఉన్నా ...  బీజేపీ కూటమి లో ఉండటం వలన ఎన్నికల కమిషన్ కు కూటమి చేసిన పిర్యాదులు ఇచ్చి కొంత మంది అధికారులను మార్చటం లాంటివి చెయ్యగలిగింది.. అది పార్టీ కి మంచి ఊరటనిచ్చింది 
వైఎస్ షర్మిల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని కంటే,  జగన్ చెల్లెలు గా జగన్ ని బాగా ఇరకాటంలో పడేసింది అని చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు ను పట్టుకొని ఆయన కుమార్తె Dr సునీత కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేయటం, చివరి రోజు వైఎస్ విజయమ్మ కూడా 'షర్మిల ను గెలిపించండి ' అని మేస్జ్ వదలటం వైఎస్సార్ పార్టీ కి నష్టం కలిగించే అంశాలు. 

*  సోషల్ మీడియా హడావుడి కూడా  చాలా ఎక్కువ గానే వుంది. ఇరు వర్గాల, వారి అభిమానులు శక్తి వంచన లేకుండా ఓటర్ ని తెగ గందర గోళం లో పడేస్తున్నారు. 
అతి పెద్ద మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు వెళ్లి పోయిన  ప్రస్తుత పరిస్తుతులలో ప్రీ పోల్ సర్వే లు అంటూ దాదాపు 25 కి పైగా ఏజెన్సీలు, యు ట్యూబ్ చానెల్స్ కూడా వైఎస్సార్సీపీ అని కొందరూ, కూటమి అని కొందరూ చెప్తున్నారు. పూర్తి స్థాయి విశ్లేషణ కూడా ఇస్తున్నారు. అయితే ఇందులో RTV ఛానల్ పెట్టి మళ్ళీ మీడియా  లోకి అడుగు పెట్టిన రవి ప్రకాష్ ,ఎన్నికల సర్వే లలో పేరున్న ఆరా మస్తాన్ , ఏజెన్సీ లు గా క్రెడిబిలిటీ వున్న ఆత్మసాక్షి , ఏకలవ్య లాంటివి కూడా వున్నాయి.. 

*  ETV, TV5, ABN AndhraJyothi TV ఛానళ్ళు కూటమి వైపు, TV9, NTV, Sakshi TV ఛానళ్ళు వైయస్సార్ పార్టీ కి అనుకూలంగా కధనాలు ప్రసారం చేశాయి. ఆ ఛానెళ్ల BARC రేటింగ్స్ ( Broadcast Audience Research Council ) ( టీవీ చానెల్స్ లో ఏ ప్రోగ్రాం కి ఎంత మంది చూస్తున్నారో లెక్క కట్టి చెప్పే సంస్థ) చూపిస్తూ విశ్లేషణ ఇచ్చారు. 

*  చివరగా రెండు వర్గాలు పోటాపోటీగా వోటర్లకు చివరి రెండు రోజులలో డబ్బు, మద్యం పంచుతున్నారని తెలుస్తోంది. మనిషికి Rs 2000 ఇస్తామని ఇవ్వలేదు అని ఓ గ్రామంలో మహిళలు, ఇచ్చిన చీరలు నచ్చలేదని ఇంకో చోట మహిళలు గొడవ చేయటం కూడా టీవీ లలో చూస్తున్నాం. 

ఇవన్నీ పరిశీలించాక ఏ పాయింట్ ఎంతమంది ని  ప్రభావితం ని ప్రభావితం చేసింది ? రురల్ ఓటర్ ఏ విధంగా ఓటు వేస్తాడు? మహిళలు ఈ విధంగా ఓటు వేస్తారు ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు మీకే వదిలేస్తున్నాను. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :