ASBL NSL Infratech

ఆనాడు షర్మిల విషయంలో తప్పనిపించింది.. భారతి విషయంలో ఒప్పు ఎలా అవుతుంది?

ఆనాడు షర్మిల విషయంలో తప్పనిపించింది.. భారతి విషయంలో ఒప్పు ఎలా అవుతుంది?

ఆంధ్ర లో ఓటింగ్ సందర్భంగా సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా సెలబ్రిటీలు వేసుకున్న దుస్తుల రంగులకి కూడా రాజకీయ రంగుల పులుముతున్నారు నేటిజన్లు. ఆ మధ్య ఒకసారి చంద్రబాబుని కలవడానికి వెళ్లిన షర్మిల పసుపు దుస్తులు వేసుకుంది అని జగన్ ప్రస్తావించారు. ఆ తర్వాత ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎటువంటి దుమారం చెలరేగిందో అందరికీ తెలుసు. షర్మిల కూడా ఈ విషయంపై చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఇక ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఉదయం ఓటింగ్ వేయడానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్  బ్లూ కలర్ షర్ట్ వేసుకోవడం తో మరో సరికొత్త దుమారం మొదలైంది. వైసీపీ కు మద్దతు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి పెట్టిన కొంతసేపటికి వైసీపీ అధినేత జగన్ భార్య వైఎస్ భారతి తెలుపు, ఎరుపు కాంబినేషన్లో చీరను ధరించి ఓటు వేయడానికి వెళ్లారు.. ఈ ఫోటోని హైలెట్ చేసిన కొందరు నెటిజన్లు ఆమె జనసేనానికి మద్దతుగా జనసేన పార్టీ రంగులు కలిసిన దుస్తులు ధరించిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది.. దేని గురించి.. ఎప్పుడు ప్రస్తావించాలి.. ఏ విషయంలో ఎంతవరకు మాట్లాడాలి.. అని చిన్ని తేడా అందరూ మర్చిపోతున్నారు. ఆనాడు షర్మిల విషయంలో.. ఆడవారి దుస్తుల గురించి మాట్లాడడం పద్ధతిగా లేదు అని కామెంట్లు పెట్టిన వారే ఇప్పుడు భారతి ధరించిన దుస్తుల గురించి మాట్లాడడం మరీ విడ్డూరంగా ఉంది. మొత్తానికి ఈరోజుతో ఏపీ లో ఓటింగ్ అనే ఒక అతి పెద్ద ఘట్టం తగువులు.. తన్నులాటలు, బెదిరింపులు.. నిందారోపణలు మధ్య ముగిసింది. ఇక అందరూ ఎన్నికల రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు…ఎవరు గెలుస్తారు అన్న విషయంపై అప్పుడే చిలక జోస్యాలు మొదలయ్యాయి. కానీ నిజం అనేది నిలకడ మీదే తెలుస్తుంది.. ఎవరు గెలిచారు అన్న విషయంపై స్పష్టత రావాలి అంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆగక తప్పదు.



praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :