ASBL NSL Infratech

అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా భారీ పెట్టుబడి

అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా భారీ పెట్టుబడి

లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఆ రంగంలోని దిగ్గజ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. భారీ పెట్టుబడులతో తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా చేరింది. రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ అధునాత ల్యాబ్ ఏర్పాటుతో ఔషధ తయారీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

మంత్రి కేటీఆర్ తో యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇండియా ఆపరేషన్స్ హెడ్ స్టాన్ బుర్హాన్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజియన్స్, స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ డాక్టర్ కె.వి. సురేంద్ర నాథ్ ల సమావేశం తరువాత ఆ సంస్థ ఈ పెట్టుబడి ప్రకటన చేసింది.

 

Tags :