ASBL NSL Infratech

టెన్నెస్సీ సంక్రాంతి వేడుకలు అద్భుతం

టెన్నెస్సీ సంక్రాంతి వేడుకలు అద్భుతం

టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విఘ్నేశ్వరుని గుడిలో దీప్తి రెడ్డి దొడ్ల అధ్యక్షతన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం నిర్వహణలో జరిగిన ఈ వేడుకల్లో 600 మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు.  భారత, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు.

జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకల్లో తొలుత ముగ్గుల పోటీలను నిర్వహించారు. తెలుగు ఆడపడుచులు పోటాపోటీగా వేసిన ముగ్గులు పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేశాయి. బొమ్మల కొలువు, చిత్రలేఖనం, చర్చా వేదిక తదితర పోటీలలో పిల్లలు పాల్గొన్నారు. పిల్లలకు భోగిపళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆటల పోటీల విజేతలకు ట్రోపీలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు వంటి వివిధ పోటీల విజేతలకు బహుమతులు, ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుడీ బ్యాగ్స్‌ అందజేశారు. అలాగే కళా రంగానికి చేస్తున్న సేవలకు గాను మోనికా కూలేని సత్కరించారు.

పాత కొత్త పాటలతో గాయకులు సందీప్‌ కూరపాటి, గాయని శతి నండూరిలు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సాంస్కతిక కార్యక్రమాలలో భాగంగా జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  ఇండియా నుంచి తెప్పించిన సంక్రాంతి స్పెషల్‌ అరిసెలతోపాటు అమరావతి రెస్టారెంట్‌ వారు అందించిన పసందైన విందు భోజనాన్ని అందరూ  ఆస్వాదించారు.

అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క తజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకించి యూత్‌ కమిటీ సభ్యులను టెన్నెస్సీ తెలుగు సమితి సేవా కార్యక్రమాలవైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లితండ్రులను కొనియాడారు. అలాగే ఈ వేడుకల నిర్వహణలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులు, ఆడియో సహకారం అందించిన డీజే శ్రీమంత్‌ బందావనం, వీడియో, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్‌ జానర్‌ తదితరులను అభినందించారు.

 

Tags :