ASBL NSL Infratech

ఉమామహేశ్వరరావుకు 'తానా' అవార్డు బహుకరణ

ఉమామహేశ్వరరావుకు 'తానా' అవార్డు బహుకరణ

తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేస్తున్న కృషి అమోఘమని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. విజయవాడలోని హోటల్‌ ఐలాపురం కాన్ఫరెన్స్‌ హాలులో 9వ తానా గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది.  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ గారపాటి ఉమామహేశ్వరరావుకు ఈ అవార్డును బహూకరించారు. ఈ  కార్యక్రమంలో వేల్చేరు నారాయణరావు, సామల రమేశ్‌బాబు, వాసిరెడ్డి నవీన్‌, బండ్ల మాధవరావు, తానా అధ్యక్షుడు జయ శంకర్‌ పాల్గొని గారపాటికి పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ, తానా తెలుగు భాషకు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

 

Tags :