ASBL NSL Infratech

కృష్ణాజిల్లాలో తానా మాస్క్ ల పంపిణీ

కృష్ణాజిల్లాలో తానా మాస్క్ ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్‍ 19 వైరస్‍ విస్తరించకుండా మాస్క్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆంధప్రదేశ్‍లోని కృష్ణా జిల్లా కంచికచర్లలో పలువురికి మాస్క్ లను పంపిణీ చేశారు. గ్యాస్‍ వర్కర్లకు, ఆటో డ్రైవర్లకు, ఇతరులకు ఈ మాస్క్లను ఇచ్చారు. అమెరికాలో ఉన్న వెంకట్‍ కోగంటి స్పాన్సర్‍ చేసిన ఈ మాస్క్ లను రావు కోగంటి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తానా ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, రవి సామినేని, వీరారావు కోగంటి తదితరులకు ఈ సందర్భంగా పలువురు ధన్యవాదాలు తెలియజేశారు.

Click here for Photogallery

 

 

Tags :