ASBL NSL Infratech

తానా మహాసభల వెబ్ సైట్ ఆవిష్కరణ

తానా మహాసభల వెబ్ సైట్ ఆవిష్కరణ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) జూలై 4 నుంచి 6వ తేదీ వరకు వాషింగ్టన్‌ డీసిలో నిర్వహించే తానా 22వ మహాసభలను పురస్కరించుకుని మహాసభల వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా ఆవిష్కరించింది. మిల్‌పిటాస్‌లోని స్వాగత్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వెబ్‌సైట్‌ను తానా మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, గంగాధర్‌ నాదెళ్ళ ఆవిష్కరించారు. తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ డా. నరేన్‌ కొడాలి, ఇతర తానా కమిటీ నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరామ్‌ కోమటి, గంగాధర్‌ నాదెళ్ళ తమ ప్రసంగంలో ప్రస్తుత తానా నాయకత్వం చేస్తున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్లను ప్రశంసించారు. ఈ మహాసభలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు.

అధ్యక్షుడు సతీష్‌ వేమన మాట్లాడుతూ, తానా మహాసభలకు వాషింగ్టన్‌ డీసి 12 ఏళ్ళ తరువాత మరోసారి ఆతిధ్యం ఇస్తోందని చెప్పారు. 2007లో వాషింగ్టన్‌ డీసిలో జరిగిన తానా మహాసభలకు అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్‌ తదితరులు హాజరయ్యారని, ఆ మహాసభలు తానా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిందని చెప్పారు. అలాగే తానా 22వ మహాసభలను కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్వహించనున్నట్లు చెప్పారు. మహాసభలు జరిగే వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కావాల్సిన ఏర్పాట్లను తానా నాయకత్వం ఇప్పటికే చేస్తోందని తెలిపారు. www.tana2019.org వెబ్‌సైట్‌లో మహాసభలకు సంబంధించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటామని చెప్పారు. దాంతోపాటు కాన్ఫరెన్స్‌ రిజిస్ట్రేషన్స్‌, డొనేషన్స్‌, స్పాన్సర్‌షిప్స్‌, హోటల్‌ బుకింగ్స్‌ తదితర వివరాలను కూడా ఇందులో పేర్కొన్నామని చెప్పారు. తానా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు కాన్ఫరెన్స్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌, హోటల్‌ బుకింగ్స్‌ ఇతర వ్యవహారాలను ముందుగానే అన్నీ ఏర్పాటు చేసుకుంటే మంచిదని సతీష్‌ వేమన అన్నారు. చివరినిముషంలో ఇబ్బందులు లేకుండా ముందుగానే తమకు అన్నీ వివరాలు తెలియజేయాలని కోరారు.

ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ట్రెజరర్‌ గా ఎన్నికైన సతీష్‌ వేమూరి, జాయింట్‌ ట్రెజరర్‌ వెంకట్‌ కోగంటి, రీజినల్‌ రిప్రజెంటెటివ్‌ రజనీకాంత్‌ కాకర్ల, తానా మాజీ కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సతీష్‌ చిలుకూరి, బాటా ప్రెసిడెంట్‌ యశ్వంత్‌ కుదరవల్లి, ఇతర తానా సభ్యులు, అభిమానులు ఈ?కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click here for Event Gallery

 

Tags :