ASBL NSL Infratech

ఘనంగా 'తాల్' సంక్రాంతి వేడుకలు

ఘనంగా 'తాల్' సంక్రాంతి వేడుకలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) సంక్రాంతి వేడుకలు 19 జనవరి వెస్ట్‌ లండన్‌లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో 500 లకు పైగా తెలుగు కుటుంబాల వారు పాల్గొన్నారు. భోగి పళ్ళు, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, రంగు రంగుల ముగ్గులతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది.

కోలాటం, గొబ్బెమ్మలు, వివిధ పాటలు, నృత్యాలతో కళకళలాడిన ఆవరణలో, అధిక సంఖ్యలో వనితలు ముగ్గులు మరియు వంటల పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తాల్‌ చైర్మన్‌ శ్రీధర్‌ మేడిశెట్టి మరియు కార్యవర్గం భారతి కందుకూరి, నిర్మల ధవళ, రాజేష్‌ తోలేటి, శ్రీధర్‌ సోమిసెట్టి, మల్లేష్‌ కోట, శ్రీనివాస్‌ రెడ్డి మరియు గిరిధర్‌ పుట్లూరి అందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సంవత్సరం చిన్నారులను ప్రోత్సహించే దిశగా వారికి గాలి పటాల తయారి పోటిని నిర్వహించి విజేతలను సత్కరించారు. గాలిపటాల పోటికి, విజేతల సత్కారానికి రాజ వశిష్ట సహకరించారు. తాల్‌ సాంస్కృతిక కేంద్రం విద్యార్థులు, గాయని కారుణ్య, ప్రియ, సాన్విత మరియు గిరిబాబు ధవళ పాడిన పాటలు, యష్కి కథక్‌ నృత్యం అందరిని అలరించాయి.

ఈ సందర్భంగా తెలుగు భాషను మరియు సంస్కృతిని భావి తరాలకు అందించే ప్రయత్నంగా తాల్‌ నిర్వహిస్తున్న తాల్‌ సాంస్కృతిక కేంద్రంలో తమ పిల్లలను చేర్పించి వారు తెలుగు భాష, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు తాల్‌ సాంస్కృతిక కేంద్రాల ఇంచార్జిలు రాజేష్‌ తోలేటి, గిరిధర్‌ పుట్లూరు ధన్యవాదాలు తెలియజేస్తూ లండన్‌ మరియు బ్రిటన్‌లో నివసిస్తున్న తెలుగు వారందరూ తమ పిల్లలను తల్లిదండ్రులకు తాల్‌ సాంస్కృతిక కేంద్రంలో చేర్పించి వారికి తెలుగు భాషను, సంస్కృతిని వారసత్వంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. తాల్‌ సాంస్కృతిక కేంద్రంలో పిల్లలకు తెలుగు భాష, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్పిస్తున్న అధ్యాపకులందరికీ, సహకరిస్తున్న వాలంటీర్స్‌ అందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

వంటల పోటి విజేతలు :

1. నీలిమ మొదటి బహుమతి, 2. సత్య శ్రీదేవి రెండవ బహుమతి, 3. సమంత మూడ బహుమతి, 4. పల్లవి నండూరు (ప్రోత్సాహిక బహుమతి).

ముగ్గుల పోటి విజేతలు :

1. శశి రేఖ మొదటి బహుమతి, 2. స్వాతి రెండవ బహుమతి, 3. ఉష మూడవ బహుమతి, జయంతి (ప్రోత్సాహిక బహుమతి).

గాలి పటాల తయారి పోటీలో పాల్గొన్న చిన్నారులు :

చతుర్వేద్‌ కస్తూరి, విశ్వజ, ఐషు, వరప్రసాద్‌ సోమిసెట్టి, వేద్‌ మేడిశెట్టి, అవిజిత్‌, గౌతం

కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వాలంటీర్స్‌ యాదాటి శర్మ, శర్మిల రెడ్డి, వైదేహి తాతపుడి, అనిత నోముల, లోకమాన్య కోట, సూర్య కందుకూరి, గిరిబాబు ధవళ, సంగీత సోమిశెట్టి, రాజా వశిష్ట, నవీన్‌ గడంసేథి, కిషోర్‌ కస్తూరి, హరిణి,  విశాలాక్షి గార్లను ప్రశంసించారు.

Click here for Event Gallery

 

Tags :