ASBL NSL Infratech

'రాజుయాదవ్' ట్రైలర్  ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయి : తేజ సజ్జా

'రాజుయాదవ్' ట్రైలర్  ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయి : తేజ సజ్జా

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, రాజు యాదవ్ చూడు, థిస్ ఈజ్ మై దరిద్రం పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజుయాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సూపర్ హీరో తేజ సజ్జా ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

కామెడీ, లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రాజు (గెటప్  శ్రీను) క్రికెట్ ఆడుతుండగా మొహానికి బాల్ తగులుతుంది. అప్పటి రాజు మొహం స్మైలీగా మారిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైన నవ్వు మొహమే వుంటుంది. మళ్ళీ మాములు దశకు రావాలంటే ఆపరేషన్ చేయాలి. దానికి డబ్బు కావాలి. మరి ఆపరేషన్ కు సరిపడా డబ్బు సమకూరిందా ? స్మైల్ ఫేస్ తో రాజు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడు? తన లవ్ లైఫ్ ఏమయింది ? ఇవన్నీ చాలా హిలేరియస్ గా ఎమోషన్ హత్తుకునేలా చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. గెటప్ శ్రీను పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. విలక్షణమైన క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించాడు. దర్శకుడు కృష్ణమాచారి కొత్త కాన్సెప్ట్ తో హోల్సమ్ ఎంటర్ టైనర్ ని రియలెస్టిక్ గా అందిచబోతున్నాడని ట్రైలర్ చుస్తే అర్ధమౌతోంది. నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెమరా పనితనం, టెక్నికల్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. శ్రీనుగారు జాంబిరెడ్డి చిత్రం నుంచి పరిచయం. తను విలక్షణమై నటుడు. జాంబిరెడ్డిలో కళ్ళు మూసుకొని నటించారు. హనుమాన్ లో పళ్ళ సెట్ పెట్టుకొని నవ్వించారు. ఏదైనా ఒక సమస్య వుంటే ఆయన అద్భుతంగా నటిస్తారు. రాజు యాదవ్ లో నవ్వుతూనే వుండాలనే సమస్య వుంది. ఖచ్చితంగా అదరగొట్టివుంటారు. ఇది చాలా మంచి కథ. ఒక అర్ధవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే అది పెద్ద సినిమా అవుతుంది. అర్ధవంతమైన ఎమోషన్స్ తో మీనింగ్ ఫుల్ మూవీ ఇది. ఇలాంటి సినిమా చేసిన టీం అందరికీ అల్ ది బెస్ట్. శ్రీను గారు చాలా మంచి వ్యక్తిత్వం వున్న మనిషి. సినిమా కోసం అహర్నిశలు కష్టపడతారు. పక్కన వున్న నటులని కూడా సపోర్ట్ చేస్తారు. కామెడీ చేయడం కష్టమైన పని. కామెడీ చేసే వాళ్ళు ఏడిపిస్తే ఎంత అద్భుతంగా వుంటుందో బ్రహ్మానందం గారు చేస్తే ఒక సారి చూశాం. ఈసారి గెటప్ శ్రీను చేయబోతున్నారు. ఇది నవ్విస్తూ మనసుని హత్తుకునే చిత్రం. మే 17న విడుదలౌతుంది. ఇలాంటి మంచి సినిమాని తప్పకుండా అందరూ ప్రోత్సహించండి.  దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. హర్ష వర్ధన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో రాజు యాదవ్ పాటని చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకి గొప్ప పేరొచ్చి శ్రీను గారికి, సినిమా యూనిట్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరో గెటప్ శ్రీను మాట్లాడుతూ... నన్ను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈ వేడుకు విచ్చేసిన తేజగారికి కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో తేజ గారు ఎంతగానో ప్రోత్సహించారు. దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా దొరుకుతుంది. మే17న మీ అందరి దీవెనలు కావాలి. ఉదయ్ చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. సురేష్ బొబ్బిలి అద్భుతమైన నేపధ్య సంగీతం అందించారు. నిర్మాత ప్రశాంత్ గారు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే17న అందరూ రాజు యాదవ్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.

దర్శకుడు కృష్ణమాచారి.. తేజ గారు సినిమా మొదలైనప్పటినుంచి మాకు సపోర్ట్ చేస్తూనే వున్నారు. తేజ గారు,  పూరి జగన్నాథ్ గారు, ప్రశాంత్ వర్మ గారు మేము అడగకముందే సినిమా నుంచి ఏది రిలీజ్ అయిన పోస్ట్ చేస్తుంటారు. వారి సపోర్టుకు ధన్యవాదాలు. ఈ సినిమా ఒక రియల్ స్టొరీ. చాలా సహజసిద్ధంగా ఈ సినిమాని తీశాం. ప్రేక్షకులు కొత్త అనుభూతి వుంటుంది. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకుంటాయి. మే17న అందరూ రాజు యాదవ్ చూసి సినిమాని పెద్ద హిట్ చేయాలి. ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది' అన్నారు.
 
హీరోయిన్ అంకిత ఖరత్ మాట్లాడుతూ... ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో కామెడీ రోమాన్స్ ఎమోషన్స్ అన్నీ వున్నాయి. తప్పకుండా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ వేడుకు విచ్చేసిన తేజసజ్జా గారికి కృతజ్ఞతలు' తెలిపారు.

నిర్మాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వేడుకు తేజ సజ్జా గారు రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం. దర్శకుడు కృష్ణమాచారి కథ చెప్పగానే అంగీకరించాను. సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. శ్రీనుగారికి, సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. మే 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తప్పకుండా సినిమాని ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేయాలి' అని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :