ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డ్రైవర్‌లెస్‌ కారులో మంత్రి నారా లోకేశ్‌

డ్రైవర్‌లెస్‌ కారులో మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటిశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడ డ్రైవర్‌లెస్‌ కారులో ప్రయాణించారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో పర్యటిస్తున్న నారా లోకేశ్‌, డ్రైవర్‌ లేకుండా ప్రయాణించే కారులో ఓ ట్రిప్‌ వేశారు. మరోవైపు గూగుల్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ఒప్పందం కుదుర్చుకున్నది. విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్‌ ఎక్స్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్‌ గూగుల్‌కు చెందిన డ్రైవర్‌లెస్‌ కారులో కాసేపు విహరించారు.

 

Tags :