Manmohan-obama: ఒబామాని మెప్పించిన మన్మోహనత్వం..

క్లిష్టపరిస్థితుల్లో విదేశాల దగ్గర దేహీ అనేపరిస్థితి నుంచి విశ్వగురు స్థాయికి ప్రయాణిస్తున్నా భారత దేశానికి.. అందుకు తగిన బాటలు వేసిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన నాయకత్వం, అపార మేధో సంపత్తి.. నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా(obama)ను సైతం మెప్పించాయి. అందుకే.. ఆయన మన్మోహనుడితో ప్రేమలో పడిపోయారు. అణు ఒప్పందం(nuke deal) వద్దంటూ అందరూ వారించినా, మైనార్టీ ప్రభుత్వమైన తగ్గేదే లేదంటూ.. ముందుకెళ్లి సాధించిన ఘనుడు మన్మోహనుడు .అందుకే సింగ్ ఈజ్ కింగ్ అన్నారు ఒబామా..
2008 సంవత్సరం.. యూపీఏ-1 పాలనాకాలమది. అమెరికాతో జరిగిన అణుఒప్పందం దేశానికి అన్నివిధాలుగా మంచిదని తలిచారు మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ(sonia) సహా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినా దానిపై ఆయన (Manmohan Singh) ధైర్యంగా ముందుకెళ్లారు. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా 2008లో అగ్రరాజ్యంతో అణుఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం కుదిరిన రెండేళ్ల తర్వాత కెనడా(cnanada)లోని టొరంటో వేదికగా జీ20 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఒబామా (US Ex President Obama) మాట్లాడుతూ మన్మోహన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేశారని ఈ వేదికపై నుంచి నేను బలంగా చెబుతున్నా’’ అని ప్రశంసించారు.
ఆ తర్వాత తాను రాసిన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలోనూ మన్మోహన్ గురించి ఒబామా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అసాధారణ ప్రతిభ కలిగిన నిజాయతీపరుడు(honesty) అని అభివర్ణించారు. భారత ప్రజల శ్రేయస్సు, ఆర్థిక సంస్కరణల కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. తన సంస్కరణలతో ఎంతోమందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. తెలివైన, ఆలోచనాత్మకమైన, కపటం లేని నిజాయతీతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్ (Manmohan Singh) సొంతమని కొనియాడారు.
1998లో భారత్ పోఖ్రాన్ 2(pokhran) అణుపరీక్షలు నిర్వహించింది. దీనిపై అప్పట్లో అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మనపై పాక్షిక ఆంక్షలు విధించింది. అయితే, అమెరికాతో మన్మోహన్ చేసుకున్న అణుఒప్పందం తర్వాత భారత్‌పై ఉన్న ఈ ఆంక్షలు తొలగిపోయాయి.