Congress-BJP: జమిలి టు జై భీమ్.. పార్లమెంటులో పొలిటికల్ ఫైట్..

ప్రస్తుత పార్లమెంటు శీతకాల పార్లమెంటు సమావేశాలు.. మేజర్ ఇష్యూస్ తో దద్దరిల్లుతున్నాయి. తొలుత జమిలి(ONE NATION-ONE ELECTION BILL)ని ప్రభుత్వం తీసుకురాగా.. దానిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలి ప్రతిపాదన.. రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించాయి. తాము ఈ బిల్ కు వ్యతిరేకమని కాంగ్రెస్ నుంచి తృణమూల్ వరకూ విపక్షపార్టీలన్నీ స్పష్టం చేశాయి. అయితే తనకున్న ఎంపీల బలంతో బీజేపీ.. ఎట్టకేలకు బిల్ ప్రవేశపెట్టి ఆమోదం పొందడం ద్వారా ఓ అడుగు ముందుకేసింది.
ఇప్పుడు అంబేడ్కర్ ను అమిత్ షా అవమానించారంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అమిత్ షా సారీ చెప్పాలని, ఆయన్ను మంత్రిపదవి నుంచి ప్రధాని మోడీ తొలగించాలంటూ నినదిస్తున్నాయి. వివిధ అంశాలపై కలిసిరాని విపక్షాలు.. ఈఅంశంపై మాత్రం తగ్గేదే లేదంటున్నాయి. మాదేముడు అంబేడ్కర్ నే విమర్శిస్తారా అంటూ బీజేపీని దుమ్మెత్తి పోస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. విపక్షాలు మాత్రం ముందుకే పోతున్నాయి. తాజాగా పార్లమెంటు ముఖ ద్వారం దగ్గర విపక్ష, అధికార ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
దళిత ప్రతిఘటనకు ప్రతీకగా నీలం రంగు దుస్తులు ధరించిన రాహుల్, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష ఎంపీలు బీఆర్ అంబేడ్కర్ ఫొటోలతో ర్యాలీ(CONG RALLY) నిర్వహించారు. జై భీమ్, అమిత్ షా సారీ చెప్పాలంటూ నినాదాలు చేశారు.మరోవైపు అంబేడ్కర్ చిత్రపటాలతో బీజేపీ ప్రత్యేక ర్యాలీ(BJP RALLY) నిర్వహించింది. ఒకానొక దశలో ఉభయ సభలు పార్లమెంటు వద్దకు చేరుకోగా, ఇరు పక్షాల ఎంపీలు ఒకరినొకరు నిందించుకున్నారు.ఈక్రమంలో ఒడిషా బీజేపీకి చెందిన ఎంపీ కింద పడడంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. రాహుల్ ఓ ఎంపీని నెట్టివేయడంతో ఆయన తనపై పడి, తాను గాయాలపాలయ్యానన్నారు బీజేపీ ఎంపీ.
.తాను పార్లమెంటులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలుపుతున్న బిజెపి ఎంపిలు తనతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను తోసేశారని రాహుల్ ఆరోపించారు.అంతేకాదు.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రవేశ ద్వారం అని, లోపలికి వెళ్లే హక్కు మాకు ఉందన్నారు రాహుల్.
బీఆర్ అంబేడ్కర్ ఫొటోలతో నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష ఎంపీల మార్ఫింగ్ ఫొటో కలకలం రేపింది.. . ఈ ఫోటోల్లో దళిత ఐకాన్ ముఖం స్థానంలో అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్(george sorus) ఫేస్ దేశాన్ని అస్థిరపరిచేందుకు సోరోస్ తో కలిసి కాంగ్రెస్ పనిచేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ సోరోస్ ఎడిట్ తర్వాత కాంగ్రెస్ తన దాడిని రెట్టింపు చేసింది. ఈ ఫోటోను బీజేపీ ట్యాంపరింగ్ చేయడం వారి మనస్తత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. హోం మంత్రి అమిత్ షా బాబా సాహెబ్ ను అవమానించారని, ఆ తర్వాత ట్విట్టర్లో బాబాసాహెబ్ ఫొటోను తొలగించారని ఆరోపించారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని ధ్వంసం చేసే మనస్తత్వం ఇది. వారిని ఎవరు నమ్ముతారు?’ అని ఆమె ప్రశ్నించారు.