Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh ) ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్ పొందారు.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు. 1991 నుండి 1996 వరకు డాక్టర్ సింగ్ భారత దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. పీవీ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా చేరిన మన్మోహన్ సింగ్ తనదైన మేధస్సులో సరళీ కృత ఆర్ధిక విధానాలను అమలు చేయడమే కాకుండా దేశానికి కొత్త దశ దిశను చూపించారు.
దేశానికి 14వ ప్రధానిగా డాక్టర్ మనొహన్ సింగ్ 2004 మే 22న బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా రెండు సార్లు ప్రధాని హోదాలో దేశానికి సేవ అందించి 2014 మే 26న పదవీ విరమణ చేశారు. మన్మోహన్ సింగ్ మరణ వార్త విన్న ప్రధాని మోడీ దేశం మొత్తం దుఖిస్తోంది అని విషాదంతో నిండిన ట్వీట్ చేశారు.