No-detention: నో డిటెన్షన్ విధానం రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం..

Central decession-విద్యార్థులు పారాహుషార్.. కేంద్రం నో డిెటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై 5, 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్(fail) చేసే అవకాశం ఉంది. అంటే తప్పనిసరిగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఒక వేళ ఫెయిల్ అయితే రెండు నెలల వ్యవధిలో ఉపాధ్యాయుల చేత మంచిగా పాఠాలు నేర్పించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మళ్లీ ఫెయిల్ అయితే అదే తరగతిలో కూర్చోబెట్టాలి. అంతే తప్ప స్కూల్ నుంచి పంపించకూడదు.
సహజంగా తొమ్మిది తరగతి వరకు హాజరు కారణంగా పై తరగతులకు ప్రమోట్ అయిపోతుంటారు విద్యార్థులు. కేవలం పబ్లిక్ ఎగ్జామ్‌లో మాత్రమే విద్యార్థుల ప్రతిభ బయటపడుతుంటుంది. కానీ ఇప్పుడైతే 5 నుంచి 8 తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా ఎగ్జామ్స్‌లో మెరుగైన ప్రతిభ కనబర్చాల్సిందే. లేదంటే.. అదే తరగతిలో కూర్చోవాల్సి ఉంటుంది. నో డిటెన్షన్ రద్దుతో విద్యార్థులకు కొత్త చిక్కులు వచ్చినట్లైంది.
2019లో విద్యాహక్కు చట్టానికి(education bill) సవరణ చేసిన తర్వాత కనీసం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే నో డిటెన్షన్ విధానం అమలవుతుంది. ఫెయిల్ విద్యార్థులకు రెండు నెలల్లో తిరిగి పరీక్షలు నిర్వహిస్తుంటారు. వారికి అదనపు కోచింగ్ ఇచ్చి మెరుగుపరుస్తుంటారు. పాస్ అయితే పై తరగతులకు ప్రమోట్ అవుతుంటారు. లేదంటే 5, 8 తరగతుల్లోనే కూర్చోబెడతారు. అయితే చదువు పూర్తయ్యే వరకు ఏ చిన్నారిని బహిష్కరించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఈ విధానం కేవలం కేంద్రీయ విద్యాలయాలు, నవోద్యాల విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలతో సహా కేంద్ర ప్రభుత్వం(central government institutes) ఆధ్వర్యంలో నడుస్తున్న 3,000 పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని సీనియర్ విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.