Priyanka-sarangi: జాతీయ రాజకీయాల్లో బ్యాగ్ పాలిటిక్స్..

పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ప్రియాంక గాంధీ(priyanka) సరికొత్త పాలిటిక్స్ కు తెరతీశారు. తొలిసారి సమావేశాల్లో పాల్గొంటున్నప్రియాంకగాంధీ.. ప్రపంచం, మనదేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబించే బ్యాగులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక సారి పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ను ధరించగా.. మరొకసారి బంగ్లాదేశ్ అని రాశి ఉన్న బ్యాగ్ ను ధరించారు. దీని ద్వారా ఈ సమస్యలను మరోసారి దేశం దృష్టికి తేవడంలో ప్రియాంక సఫలమయ్యారు.
ఈ బ్యాగ్ పాలిటిక్స్ కు బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి(aparajitha sarangi) కౌంటరిచ్చారు. 1984 అని రాసి ఉన్న బ్యాగ్ ను ప్రియాంకకు గిఫ్ట్ గా ఇచ్చారు సారంగి. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను(sikh riots) సూచించే విధంగా రక్తపు మరకలు చిమ్మి నట్లు ఉంది. ప్రియాంక గాంధీ బ్యాగ్ ద్వారా బిజేపీ ఎంపీ ఒక సందేశాన్ని పంపినట్లు అయింది.
ప్రియాంక బ్యాగ్ ద్వారా ఇస్తున్న మెసేజ్‌లకు స్పందించి ప్రత్యేకంగా ఈ బ్యాగ్‌ను సిద్ధం చేసినట్లు అపరాజిత చెప్పారు.
ప్రియాంక వాద్రాకు ఇచ్చిన బ్యాగ్ గురించి సారంగి ప్రస్తావించారు కూడా.బ్యాగ్ డిజైన్‌లో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను సూచిస్తూ అప్పుడు చిందిన నెత్తురి మరకలు గుర్తు తెచ్చేలా ఉన్నాయి. కాంగ్రెస్ తప్పిదాలను, ఆ కాలంలోని విషాదాన్ని గుర్తుచేస్తున్నట్లు అపరాజిత అభివర్ణించారు. ప్రియాంక గాంధీ బ్యాగ్ ద్వారా సందేశం పంపినట్లే తాను కూడా కాంగ్రెస్ చరిత్రను గుర్తుచేసే విధంగా ఆమెకు ఈ బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చానని తెలిపారు.
బ్యాగ్‌పై రక్తంతో పెయింట్ చేయబడిన ‘1984’ ఉంది. ఇది ఆ సంవత్సరంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను గుర్తు చేస్తుంది. ఇందిరా గాంధీ హత్య తర్వాత ఢిల్లీలో ఈ అల్లర్లు చెలరేగాయి. వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ఇది కాంగ్రెస్ దౌర్జన్యాలకు ప్రతీకగా అభివర్ణించిన అపరాజిత.. కాంగ్రెస్ గతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకే ఈ బ్యాగును అందజేశామన్నారు. ఈ బ్యాగును తీసుకున్న ప్రియాంక.. ఈ ఘటనపై స్పందించలేదు.