Maha Kumbamela: మహాకుంభమేళాకు భారీగా ఏర్పాట్లు..

మహాకుంభమేళా… దేశంలోని కోట్లాదిమంది హిందువులకు కుంభమేళా చాలా ముఖ్యమైంది. మరికొన్ని రోజుల్లో గంగానదిపుష్కరాలు(Ganga puskar) ప్రారంభం కానున్నాయి. వీటినే మహా కుంభమేళాగా పేర్కొంటారు. ఈ కుంభమేళాకు సాధువులు, భక్తులు, పర్యాటకులు వరలి వస్తారు. ఈసారి 45 కోట్ల మంది కుంభమేళాకు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ సర్కార్ కూడా ఏర్పాట్లును పర్యవేక్షిస్తోంది. ఆధునిక టెక్నాలజీని కూడా భద్రతకు వినియోగిస్తోంది.
జనవరి 13 నుంచి గంగా పుష్కరాలు..
కుంభమేళా జనవరి 13న ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 26 వరకు వేడుకలు సాగుతాయి. ఈమేరకు ప్రయాగ్‌రాజ్‌లో(Prayag raj) జరిగే మహాకుభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని యోగీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా హైఎండ్ టెక్నాలజీ వాడుతున్నారు. అండర్ వాటర్ డ్రోన్లను(Under water drones) అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో సీసీకెమెరా నిఘా నేత్రాలు గమనిస్తున్నాయి. ఇప్పటికే ట్రయల్స్ పూర్తయింది.
అండర్ వాటర్ డ్రోన్లు..
ఈసారి భద్రతా ఏర్పాట్లలో భాగంగా అండర్ వాటర్ డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు. భక్తులెవరైనా నీటిలో మునిపోతే వెంటనే గుర్తించి కాపాడేలా అండర్ వాటర్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో పర్యాటకుల వసతి సహా భద్రత కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా మహాకుంభ మేళా విజయవంతం చేయాలని కోరుతున్నారు.
ఆరోగ్య భరితంగా…
యూపీలో నిర్వహించే మహా కుంభ మేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి మహాకుంభమేళాను గతంలో కంటే అద్భుతంగా నిర్వహిస్తాయంటున్నారు. హరిద్వార్, నాసిక్ ఉజ్జయినీ తారాల్లో కుంభమేళాల్లో ఏర్పాట్ల సందడి నెలకొంది. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది నిర్వహించిన చివరి మన్‌కీ బాత్‌లో మహాకుంభమేళాను ప్రస్తావించారు. దీని ఐక్యతా మేళాను నిర్వహించి ఆధ్యాత్మిక సాంస్కృతిక, భద్రత గురించి సూచనలు చేశారు.
రక్షణ ఏర్పాట్లు..
కుంభమేళాలో భద్రత కోసం 50 వేల మంఇ పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు.కృత్రిమ మేధ సాంకేతికతతో కూడిన 2,700 కెమెరాలు వినియోగించనున్నారు. తొలిసారి అడ్వయిజరీ బోర్డు ఏర్పాటు చేయనున్నారు.పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్, 56 మంది సైబర్ వారియర్లను అందుబాటులో ఉంచుతారు.
భారతీయ భాషల్లో చాట్స్…
కుంభమేళాలో సమాచారం కోసం భారతీయ భాషల్లో చాట్స్ కోసం ఏఐ ఛానల్స్ ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు సూచనలు చేసేందుకు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తారు.తాత్కాలిక ఆస్పత్రులతోపాటు శస్త్రచికిత్స, రోగ నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నారు. 200 మందికి చికిత్స అందించే భీష్మ క్యూబ్ ఏర్పాటు చేస్తారు.నేత్ర కుంభ్ శిబిరంలో 5 లక్షల మంది యాత్రీకులకు కంటి పరీక్షలు, 3 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.