ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. వైరల్ అవుతున్న వీడియో..

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. వైరల్ అవుతున్న వీడియో..

ఏపీ రాజకీయాలలో వివేకా హత్య ఎటువంటి పెను సంచలనాలను తీసుకువస్తుందో అందరికీ తెలుసు. 2019 నుంచి ఈ హత్య ఓ రాజకీయ మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పటివరకు ఈ హత్య కేసుకి సంబంధించిన వ్యవహారం తేలలేదు. మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు.. రెండుసార్లు సిబిఐ బృందాలు విచారించిన ఇంకా హత్య ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనే విషయాలు పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయాయి. ఆ విషయం పక్కనపెడితే గత కొద్ది కాలంగా షర్మిల, సునీత వివేకా హత్య కేసును జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి లపై నెట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేశారు. తన తండ్రి హత్య కేసు విచారణ విషయంలో ఆలస్యం జరుగుతోంది అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రతిపక్షాలు ‘who killed babai’ అనే హ్యాష్ టాగ్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేక జీవితానికి సంబంధించిన మరొక సంచలమైన పరిణామం చోటుచేసుకుంది. వివేకానంద రెండవ భార్య, కొడుకుతో కలిసి ఆనందంగా గడుపుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవుతోంది. తండ్రి ఆస్తి విషయంలో భాగం ఇవ్వడం ఇష్టం లేక సునీత ఆయనతో తరచూ గొడవపడేది అంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడే సునీత మాత్రం తన తండ్రి రెండవ వివాహం గురించి తెలియదన్నట్లు ప్రవర్తించడం ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తానికి ఈ సరికొత్త అంశం వివేకా హత్య కేసులో ఎటువంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :