ASBL NSL Infratech

ఆర్థిక సుడిగుండంలో పడి పాక్ విలవిల..

ఆర్థిక సుడిగుండంలో పడి పాక్ విలవిల..

పాకిస్తాన్ నేతలు, ప్రజలు కళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడు తమ దేశ పరిస్థితిని చూసి చింతిస్తున్నారు. అంతకన్నా చెప్పాలంటే ఆవేదన చెందుతున్నారు. తాము ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేదెలా అని బాధపడుతున్నారు. పొరుగుదేశాలు ఆర్థికంగా వృద్ధిపథంలో దూసుకెళ్లుంటే.. తాము మాత్రం అప్పులెవరిస్తారా అని తలపట్టుకుంటున్నారు.. పాకిస్తాన్ అధ్యక్షుడి నుంచి సాదారణ పౌరుల వరకూ ఇప్పుడు అందరి చింత ఒక్కటే. ఎన్నాళ్లిలా..? ఎన్నేళ్లిలా..?

పాక్ ప్రజల్లో అంతర్మథనం..

భారత్ చంద్రయాన్ మిషన్ విజయవంతం కావడంతో పాకిస్తాన్ ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. పొరుగుదేశాన్ని క్రష్ చేయాలని చిన్నప్పటి నుంచి చెవిలో ఇళ్లు కట్టుకుని పోరిన నేతలు.. ఇప్పుడు తమను ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారా అని బాధపడుతున్నారు. సూపర్‌ పవర్‌గా ఎదగాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంటే పాకిస్థాన్‌ నిధుల కోసం అడుక్కుంటోందని విపక్ష నేత మౌలానా ఫజులుర్‌ రహ్మాన్‌ వ్యాఖ్యానించారు. జమాత్‌ ఉలేమా ఎ ఇస్లాం (ఫజల్‌) పార్టీ నాయకుడైన ఆయన పార్లమెంటు ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు.

భారత్ అలా..? మనమిలా...?

దేశ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ‘‘1947లో భారత్‌, పాకిస్థాన్‌లకు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చింది. ఇవాళ భారత దేశం ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. మనం మాత్రం దివాళా పరిస్థితి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నాం. ఇంతగా అంతరం ఉండడానికి కారకులు ఎవరు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల తీరుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇవేమి ఎన్నికలు? ఓడిన వారు అసంతృప్తిలో ఉండడం.. గెలిచిన వారిలోనూ సంతోషం కనిపించకపోవడం..ఇదేమి పరిస్థితి?’’ అని అన్నారు.

బంగ్లాదేశ్ కూడా అభివృద్ధి వైపు వెళ్తోంది...

ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్‌ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. పాక్‌ వర్తకులతో ఇటీవల జరిగిన భేటీలో బంగ్లాదేశ్‌ ఆర్థికవృద్ధిని ఆయన ఉదాహరించారు. ఎగుమతుల ద్వారా ఆర్థికవ్యవస్థను పెంపొందించే మార్గాలపై చర్చించేందుకు ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలతో చర్చించిన షెహబాజ్‌ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతపై నేరుగా స్పందించలేదు. వాస్తవమైన పారిశ్రామిక, వ్యవసాయ వృద్ధి సాధించడం, వచ్చే అయిదేళ్లలో ఎగుమతులను రెట్టింపు చేయడంపై దృష్టి పెడతామని చెప్పారు. ఇది కష్టమైనదే అయినప్పటికీ అసాధ్యం కాదన్నారు. బంగ్లాదేశ్‌ ఆర్థికవృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘‘తూర్పు పాకిస్థాన్‌గా పిలిచే ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు దేశానికి భారంగా భావించాం. ఇప్పుడు పారిశ్రామిక వృద్ధిలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. నేను యువకుడిగా ఉన్న రోజుల్లో మన భుజాలపై అదో భారం అని చెప్పేవాళ్లు. ఈరోజు చూస్తే.. ఆర్థికపరంగా ఆ దేశం ఎక్కడికి చేరిందో మనందరికీ తెలుసు. మనం వాళ్లను చూసి సిగ్గుపడుతున్నాం’’ అని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :