ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అంచ‌నాల‌ను మించిపోతున్న టిల్లు స్వ్కేర్

అంచ‌నాల‌ను మించిపోతున్న టిల్లు స్వ్కేర్

డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్ట‌ర్ అవ‌డంతో దానికి సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ ను రూపొందించారు. సినిమాపై రిలీజ్ కు ముందే మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అనుకున్న‌ట్లే బాగా హైప్ వ‌చ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జ‌రిగాయి. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. క్రేజ్ ఉంది సినిమా బాగా ఆడుతుంది అని అంతా అనుకున్నారు కానీ ఏకంగా టిల్లు స్వ్కేర్ రూ.100 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధిస్తుంద‌ని మాత్రం అనుకోలేదు.

అది కూడా ప‌ది రోజుల్లోపే. రిలీజైన మూడో వారంలో కూడా టిల్లు స్వ్కేర్ బాక్సాఫీస్ లీడ‌ర్ గా కంటిన్యూ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవ‌ర్సీస్ లో కూడా టిల్లు స్వ్కేర్ త‌న స‌త్తా చాటుతుంది. ఫ‌స్ట్ వీక్ లో 2 మిలియ‌న్ డాల‌ర్ మార్క్ ను అందుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన టిల్లు స్వ్కేర్ ఇప్పుడు ఏకంగా 3 మిలియ‌న్ మార్క్ ను అందుకుంది.  
 
సంక్రాంతికి రిల‌జైన గుంటూరు కారం సినిమా కంటే టిల్లు స్వ్కేర్ సినిమానే యూఎస్ లో ఎక్కువ క‌లెక్ట్ చేసింది. టిల్లు స్వ్కేర్ లాంటి చిన్న సినిమా ఏకంగా 3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిందంటే మామూలు విష‌యం కాదు. చూస్తుంటే ప్ర‌పంచ వ్యాప్తంగా టిల్లు స్వ్కేర్ రూ.130 కోట్ల వ‌ర‌కు ఉండేట్లు క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు క్యూబ్ ను త్వ‌ర‌లోనే మేక‌ర్స్ స్టార్ట్ చేయ‌నున్నారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :