ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాగ చైత‌న్య‌, నితిన్ సినిమాల‌కు క్లాష్?

నాగ చైత‌న్య‌, నితిన్ సినిమాల‌కు క్లాష్?

ఈ మ‌ధ్య ప్ర‌తి సినిమాకూ రిలీజ్ డేట్స్ స‌మ‌స్య బాగా ఇబ్బందిగా మారింది. ఎంతో ముందుగా డేట్ ను రిజ‌ర్వ్ చేసుకుంటే త‌ప్పించి సోలో రిలీజ్ డేట్ ద‌క్క‌డం లేదు. చిన్న సినిమాల‌కైతే పోటీ త‌ప్ప‌నిసరి అయిపోయింది. ఎంతో టైముంది అని అంద‌రూ అనుకున్న‌ప్ప‌టికీ డిసెంబ‌ర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు సైతం ఇప్పుడే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి.

నితిన్- వెంకీ కుడుములు కాంబోలో తెరెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాను డిసెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాస్త‌వానికి ఈ సినిమా అంత‌కంటే ముందే వ‌స్తుంద‌నుకున్నారు కానీ షూటింగ్ చాలా వ‌ర‌కు పెండింగ్ ఉండ‌టంతో హ‌డావిడి లేకుండా స్లో గా వ‌ద్దామ‌ని మేక‌ర్స్ డిసెంబ‌ర్ కు ఓటేశారు.

మ‌రో వైపు నాగ‌చైత‌న్య‌- చందూ మొండేటి కాంబోలో వ‌స్తున్న తండేల్ ను కూడా డిసెంబ‌ర్ 20కే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. వాస్త‌వానికి తండేల్ ను అక్టోబ‌ర్ లో రిలీజ్ చేద్దామ‌నుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లేట‌య్యేలా ఉండ‌టంతో త‌మ రిలీజ్ ను డిసెంబ‌ర్ కు వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి తండేల్‌, రాబిన్‌హుడ్ మ‌ధ్య పోటీ అయితే ఫిక్స్ అయ్యేలానే ఉంది. సేమ్ ఇలాంటి సిట్యుయేష‌నే గ‌తేడాది కూడా వ‌చ్చింది. కానీ త‌ర్వాత స‌లార్ సినిమా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల మిగిలిన సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు కూడా అలాంటి పెద్ద సినిమాలు ఏవైనా రంగంలోకి దిగితే తండేల్, రాబిన్‌హుడ్ డేట్స్ మార్చుకుంటాయో లేక చెప్పిన తేదీకే క‌ట్టుబ‌డతాయో చూడాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :