మానసిక వికాసం కోసం ఆటా వెబినార్

మానసిక వికాసం కోసం అమెరికా తెలుగు సంఘం (ఆటా) వెబినార్, ట్రైనింగ్ నిర్వహిస్తోంది. స్వామి ముకుందానంద నేతృత్వంలో ‘ది సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్‌మెంట్’ వెబినార్.. ఆగస్టు 12వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు తొలి సెషన్ ట్రైనింగ్, 26వ తేదీన రెండో సెషన్, సెప్టెంబర్ 2న మూడో సెషన్ జరుగుతాయి. నాలుగో సెషన్‌లో స్వామీజితో ప్రశ్నోత్తరాలు కూడా ఉంటాయి. ఈ వెబినార్, శిక్షణ కోసం రిజిస్టర్ చేసుకోవాలని అనుకునే వారు https://tinyurl.com/ATA-Spritual-2023. లింకులో దరఖాస్తు చేసుకోవాలని ఆటా తెలిపింది.