TTA: టిటిఎ న్యూయార్క్ ఆధ్వర్యంలో మహిళల క్రీడాదినోత్సవం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) న్యూయార్క్ చాప్టర్ (New York Chapter) ఆధ్వర్యంలో విజయవంతంగా మహిళల క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, టిటిఎ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉష మన్నెం (మాట్రిమోనియల్ డైరెక్టర్), రంజీత్ క్యాతం (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్), శ్రీనివాస్ గూడురు (సోవెనీర్ డైరెక్టర్), జయప్రకాష్ ఎంజాపురి మరియు న్యూయార్క్ బృందంలోని పలువురు కృషి చేశారు. ఈ సందర్భంగా టిటిఎ నాయకులు మాట్లాడుతూ, మహిళల క్రీడా కార్యక్రమాలకు తమ సంఘం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.








