టెక్సాస్‌లో టీపీఏడీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అగ్రరాజ్యంలోని టెక్సాస్ నగరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇక్కడ రక్తదానం చేసిన వారికి ఉచితంగా బీచ్ టవల్ ఇస్తున్నట్లు కార్టర్ బ్లడ్‌కేర్ సంస్థ తెలిపింది. అలాగే ఇక్కడకు వచ్చిన వారందరికీ ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ కూడా అందజేస్తారు. గడిచిన మూడు నెలల క్రితం యూఎస్ బయటకు వెళ్లి వచ్చిన వారు కూడా రక్తదానానికి అర్హులనేనని నిర్వాహకులు తెలిపారు.
ఈ శిబిరంలో పాల్గొని కమ్యూనిటీకి సేవ చేయడంలో భాగస్వాములు కావాలని స్థానికులందర్నీ టీపీఏడీ కోరుతోంది. అపాయింట్‌మెంట్ తీసుకోవాలని అనుకున్న వారు https://ww3.greatpartners.org/donor/schedules/drive_schedule/143335 ఈ లింకులో సంప్రదించాలని తెలిపారు. అలాగే రక్తదానం చేయాలని అనుకున్న వారు https://qs.carterbloodcare.org/AQS_PRELIM_QUESTIONS/Dhhq_preconsent_edu?Dontype=HOM లింకు ద్వారా క్విక్ స్క్రీన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, దానిలో ఇచ్చిన 50 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే రక్తదాన శిబిరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ అన్నమనేని గారిని 901-620-7225 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.